
ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయాన్ని అందుకుంది. మంగళవారం (మే 27) లక్నో సూపర్ జయింట్స్ పై 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి రాయల్ గా క్వాలిఫయర్ 1 లోకి అడుగుపెట్టింది. భారీ ఛేజింగ్ లో ఆర్సీబీ కెప్టెన్ జితేష్ శర్మ (33 బంతుల్లో 85: 6 సిక్సులు, 8 ఫోర్లు) వీరోచిత ఇన్నింగ్స్ కు తోడు కోహ్లీ (54) హాఫ్ సెంచరీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. మయాంక్ అగర్వాల్ (41) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి గెలిచింది.
228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సాల్ట్, కోహ్లీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడడంతో పవర్ ప్లే 66 పరుగులు చేసి లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. 6 ఫోర్లు కొట్టి మంచి టచ్ లో కనిపించిన సాల్ట్ ఆరో ఓవర్ లో ఔటవ్వడంతో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. పవర్ ప్లే తర్వాత ఆర్సీబీ ఒక్కసారిగా తడబడింది. ఈ సీజన్ లో పేలవ ఫామ్ లో ఉన్న రజత్ పటిదార్ 14 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన లివింగ్ స్టోన్ తొలి బంతికే డకౌటయ్యి బెంగళూరును కష్టాల్లోకి నెట్టాడు.
ఒక పక్క వికెట్లు పడుతున్నా కోహ్లీ జట్టును ముందుండి నడిపించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ జట్టు స్కోర్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో 27 బంతుల్లో సెంచరీ చేసుకున్న కోహ్లీ.. 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. ఈ సమయంలో జితేష్ శర్మ, మయాంక్ అగర్వాల్ కొన్ని మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా జితేష్ అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ లక్నోపై బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకొని ఇదే ఊపులో ఆర్సీబీకి చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. లక్నో బౌలర్లలో విలియం ఓరూర్కే రెండు.. ఆకాష్ మహారాజ్.. ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ తమ చివరి మ్యాచ్ లో అదరగొట్టింది. లక్నో వేదికగా మంగళవారం (మే 27) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ సీజన్ లో తొలిసారి విజృంభించిన రిషబ్ పంత్ సెంచరీతో (61 బంతుల్లో 118: 11 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగడంతో పాటు సూపర్ ఫామ్ లో ఉన్న మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67:4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, తుషార, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.
HIGHEST CHASE IN RCB HISTORY 👏#LSGvRCB scorecard 👉 https://t.co/88VvfSaIEd pic.twitter.com/8bGo8mcWzb
— ESPNcricinfo (@ESPNcricinfo) May 27, 2025