మజా రావడం లేదు.. అందుకే రాజీనామా చేస్తున్న

మజా రావడం లేదు.. అందుకే రాజీనామా చేస్తున్న

ఎవరైనా ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వస్తే... అప్పుడు చేస్తున్న జాబ్ కన్నా ఎక్కువ శాలరీ వస్తుందనో, లేదా ఒత్తిడి భరించలేకనో.. అదీ కాదంటే ఇంకేదైనా పర్సనల్ రీజన్స్ వల్ల చేస్తారు. ఆ నిర్ణయం తీసుకునే ముందు కూడా ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించాకే రిజైన్ చేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అందుకు విభిన్నమైన కారణంతో ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. ఇక వివరాల్లోకి వెళితే.. ప్రముఖ కంపెనీ ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ ఉద్యోగులలో ఒకరు రాజీనామా చేశారు. కానీ అందుకు గల కారణాన్ని అందరిలా కాకుండా తన సమస్యను సూటిగా సుత్తిలేకుండా మూడు ముక్కల్లో చెప్పారు. అదేమంటే.. డియర్ హర్ష్.. నేను రాజీనామా చేస్తున్నాను. మజా రావడం లేదు అని అంతటితో ఆ లేఖను ముగించాడు ఆ ఉద్యోగి. దీనికి సంబంధించిన ఫొటోను ఆ కంపెనీ ఛైర్మన్ హర్ష్ గోయెంకా షేర్ చేయడంతో ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది.  ‘‘ఈ లెటర్ చిన్నగా ఉన్నా .. చాలా లోతుగా ఆలోచింపచేస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య. మనందరం కలిసి సాల్వ్ చెయ్యాలి’’ అని హర్ష్ ట్వీట్ చేశారు.