V6 News

రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ నాండ్రీ బర్గర్‌‌‌‌‌‌‌‌కు జరిమానా

 రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ నాండ్రీ బర్గర్‌‌‌‌‌‌‌‌కు జరిమానా

లక్నో: రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ నాండ్రీ బర్గర్‌‌‌‌‌‌‌‌కు జరిమానా పడింది. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ కండక్ట్‌‌‌‌‌‌‌‌ను ఉల్లంఘించినందుకు అతనికి 10 శాతం ఫైన్‌‌‌‌‌‌‌‌ విధించారు. అలాగే ఒక డీమెరిట్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ కేటాయించారు. లక్నోతో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టేలా వ్యవహరించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం లేదా అభ్యంతరకర సంజ్ఞలు చేయడం వంటి నిబంధనలను బర్గర్‌‌‌‌‌‌‌‌ ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈ చర్య తీసుకున్నారు. బర్గర్‌‌‌‌‌‌‌‌ తన తప్పును అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేదని రిఫరీ వెల్లడించారు. బుధవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ 40 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో లక్నోపై నెగ్గింది.