కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు టెక్నీషియన్ గ్రేడ్ –I సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ –III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియ జూన్ 30న ప్రారంభమై జులై 29న ముగుస్తుంది.
పోస్టు పేరు: టెక్నీషియన్ గ్రేడ్– I సిగ్నల్ & టెక్నీషియన్ గ్రేడ్ III
మొత్తం ఖాళీలు: 6565.
విభాగాల వారీగా ఖాళీలు: టెక్నీషియన్ గ్రేడ్– I సిగ్నల్ – 323, టెక్నీషియన్ గ్రేడ్ III– 6242.
ఎలిజిబిలిటీ
టెక్నీషియన్ గ్రేడ్ I: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇనుస్ట్రుమెంటేషన్లో బీఎస్సీ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ/ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
టెక్నీషియన్ గ్రేడ్ III-: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి/ మెట్రిక్యులేషన్ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా అప్రెంటీస్షిప్ కలిగి ఉండాలి.
వయోపరిమితి
టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్: 18 నుంచి 36 ఏళ్ల మధ్యలో ఉండాలి.
టెక్నీషియన్ గ్రేడ్ III: 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జూన్ 30.
లాస్ట్ డేట్: జులై 29.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ షెడ్యూల్: 2027, మార్చి 6, 9, 10, 13.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.rrbcdg.gov.inను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
కంప్యూటర్ బేస్డ్ టెస్టు(సీబీటీ)లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 90 నిమిషాల్లో పూర్తిచేయాలి. నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తున్నారు.
