ఆర్‌ఆర్‌ఆర్‌ పనులును వేగవంతం చేయాలి.. సీఎం ఆదేశాలు

  ఆర్‌ఆర్‌ఆర్‌ పనులును వేగవంతం చేయాలి.. సీఎం ఆదేశాలు

రీజనల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను  సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.  3 నెలల్లో భూసేకరణను పూర్తి చేయాలని,  ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరం పనులకు టెండర్లు పిలవాలన్నారు.  ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని ఎన్‌హెచ్‌గా ప్రకటించాలని ఎన్‌హెచ్‌ఏఐని సీఎం కోరారు.  ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు.   ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి ఎంత అర్థిక బారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం వెల్లడించారు.  

మరోవైపు సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన కొనసాగుతోంది. 2024 జనవరి 16వ తేదీ మంగళవారం రోజున  డబ్ల్యూఈఎఫ్‌ అధ్యక్షుడితో సీఎం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం.. సీ4ఐఆర్‌ ఏర్పాటుపై సంయుక్త ప్రకటన చేశారు. బయోఏషియా సదస్సులో ఫిబ్రవరి 28న సీ4ఐఆర్‌ ప్రారంభం కానుంది. ప్రపంచ ఆర్థిక ఫోరం లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు ఉంటాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.