
బాక్సాఫీస్ వద్ద రికార్డ్ లు సృష్టించిన ఆర్ఆర్ఆర్ కు అవార్డ్ ల పంట పండుతోంది. ఇటీవలే నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న ఈ మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది. లేటెస్ట్ గా బెస్ట్ ఓరిజనల్ స్కోర్ మ్యూజిక్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ కు ‘లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డ్ వరించింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ అవార్డ్ అందుకున్నారు.
కీరవాణికి అభినందనలు తెలియజేస్తూ అవార్డ్ అందుకున్న ఫోటోలను ఆర్ఆర్ఆర్ టీం తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో కీరవాణికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.