
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న బిగ్ ప్రాజెక్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. శుక్రవారం రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ వీడియోను రిలీజ్ చేసింది యూనిట్. బీమ్ ఫర్ రామరాజు పేరుతో విడుదలైన ఈ వీడియోలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించి ఫ్యాన్స్ కు సర్ ఫ్రైజ్ ఇచ్చారు. ఈ వీడియోతో రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో పరిచయం చేశారు. ఈ క్రమంలో అల్లూరిని ఇంట్రడ్యూస్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవర్, పలికిన డైలాగ్‌లు బాగున్నాయి. చరణ్ ఎలివేషన్ సీన్స్ హైలైట్ గా ఉన్నాయి. కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డబుల్ బోనస్.
73 సెకన్లున్న బీమ్ ఫర్ రామరాజు వీడియోను తెలుగులో డీవీవీ మూవీస్, తమిళంలో ఎన్టీఆర్, హిందీలో అజయ్ దేవగణ్, కన్నడలో వారాహి, మలయాళంలో రామ్ చరణ్‌లు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అన్ని భాషల్లోనూ ఎన్టీఆర్ వాయిస్ అందించండంతో .. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.