మార్చి 25న  ఆర్ ఆర్ ఆర్ రిలీజ్

 మార్చి 25న  ఆర్ ఆర్ ఆర్ రిలీజ్

కరోనా మహమ్మారి కారణంగా  వాయిదా ప‌డుతూ వ‌స్తున్న RRR సినిమా... ఎట్ట‌కేల‌కు రిలీజ్ డేట్ ను విడుద‌లైంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన కుదరలేదు. మళ్లీ ఎప్పుడు రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తారా అని అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 18వ తేదీన గానీ .. ఏప్రిల్ 28వ తేదీనగాని ఈ సినిమాను విడుదల చేయనున్నారనే టాక్ వినిపించింది. అయితే ఊహించిన దానికంటే ముందుగానే కరోనా తీవ్రత తగ్గుతూ ఉండటంతో మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు . కొద్ది సేపటి క్రితమే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది చిత్ర బృదం.

మరిన్ని వార్తల కోసం...

కరోనా ఆంక్షల సడలించిన బెంగాల్