
ఎస్.ఎస్.రాజమౌళి అంటే ఒక పేరు కాదు.. విజయాలకు కేరాఫ్ అడ్రస్. సినిమాలపై ఆయన ముద్ర ఒక బ్రాండ్. రాజమౌళి సినిమా వస్తోందంటే కేవలం తెలుగు చిత్ర పరిశ్రమే కాదు, యావత్ భారత్ సినీ పరిశ్రమ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంది.
ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే భారీ ఎత్తున బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం.
ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బడ్జెట్ దాదాపు 400 కోట్లు. ఏకంగా 10 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
విడుదలకు ముందే నిర్మాత డబల్ ప్రాఫిట్స్ తో సినిమాను అమ్మాలని చూస్తున్నారు. అందుకు తగ్గట్లే సినిమా బయ్యర్లు కూడా రేటు ఎంతంటే అంత వెనకాడకుండా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం
నిర్మాత దిల్ రాజు నైజాం వాటాకు – 75కోట్లు
కర్ణాటక లో ఏషియన్- వారాహిలు – 50కోట్లు
సీడెడ్ లో వారాహి – 40 కోట్లు
వైజాగ్ లో వారాహి -30కోట్లతో దక్కించుకున్నట్లు తెలుస్తోంది.