మాకు కోర్టుకు వెళ్లే ఆలోచన లేదు

మాకు కోర్టుకు వెళ్లే ఆలోచన లేదు

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మించారు నిర్మాత డీవీవీ దానయ్య. అయితే ఏపీలో కొన్నాళ్లుగా థియేటర్ ఇష్యూస్, టికెట్ రేట్లు, ఆన్‌‌‌‌లైన్ టికెటింగ్‌‌‌‌పై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దాంతో సినిమా టికెట్ ధరల గురించి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్  కోర్టుకు వెళ్లనుందంటూ వార్తలు వస్తున్నాయి. అంతకంతకు ప్రచారం ఎక్కువవడంతో చిత్ర నిర్మాత ట్విటర్‌‌‌‌‌‌‌‌లో రియాక్టయ్యారు. ‘టికెట్ ధరలు తగ్గించడం మా సినిమాపై  తీవ్ర ప్రభావం చూపుతుందన్నది నిజం. కానీ మాకు కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదు. ఏపీ సీఎంని కలిసి మా సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాం’ అన్నారు. అయితే ఇప్పటికే సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని కలిసి ఆన్‌‌‌‌లైన్ టికెటింగ్‌‌‌‌కి ఓకే చెప్పినా, టికెట్ రేట్లు మాత్రం తగ్గించొద్దని  కోరారు. కానీ ఏపీ ప్రభుత్వం దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’తో పాటు స్టార్ హీరోల సినిమాలు చాలానే రిలీజ్ కానున్నాయి. కాబట్టి భారీ బడ్జెట్​తో తీసిన సినిమాలకు టికెట్ రేట్ తగ్గిస్తే కలెక్షన్స్ అనుకున్నంతగా రావని కొందరు ఫీలవుతున్నారు. ఈ సమస్య ఎప్పటికి సాల్వ్ అవుతుందో చూడాలి.