కరీంనగర్ రూరల్, వెలుగు: ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ.లక్ష నగదును పోలీసులు పట్టుకున్నారు. రేకుర్తికి చెందిన శ్రీకాంత్ నగునూరు నుంచి జూబ్లీనగర్ వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో పోలీసులు చెక్ చేయగా.. అతని రూ.లక్ష నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ ఎ.నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపనందున ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఆ డబ్బును తహసీల్దార్, రిటర్నింగ్ అధికారికి సమర్పించినట్లు సీఐ తెలిపారు. దీంతోపాటు అక్రమంగా మద్యం తరలిస్తున్న ముద్దసాని సూర్యచందర్, మల్లేని సింహాద్రి, బద్ధం రమేశ్, జంగంపల్లి రవి వద్ద నుంచి సుమారు 32 లీటర్ల విస్కీ, బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
బోయినపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. గ్రామానికి చెందిన పర్శ వేణుకుమార్ఇంట్లో తనిఖీలు నిర్వహించగా రూ. 4,400 విలువైన మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

