
- ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్
కొడంగల్, వెలుగు: కొడంగల్ పట్టణంలోని శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని రూ.వంద కోట్లతో అభివృద్ధి చేస్తామని ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ తెలిపారు. శనివారం ఆలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కల్యాణ మండపం, కల్యాణ కట్ట, కోనేరు, ప్రసాదాల తయారీ కేంద్రాలు, వసతి గృహాలు తదితర పనులు రెండేళ్లలో పూర్తిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్ రావు, కలెక్టర్ ప్రతీక్ జైన్, ధార్మిక సలహాదారు గోవింద్ హరి, ట్రైనీ కలెక్టర్ హార్ష్ చౌదరి, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.