
సినీ పరిశ్రమలో ప్రేమ, బంధాలు ఎప్పుడూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలాంటి ఓ పాత జ్ఞాపకం ఇప్పుడు నెట్టింట మళ్లీ తెగ వైరల్ అవుతోంది. నటి సమంత తన మాజీ మామ నాగార్జునపై చేసిన కామెంట్స్, చూపించిన ఆప్యాయత, ఆయనను పొగిడిన పాత వీడియో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కింగ్ నాగార్జున 66వ పుట్టిన రోజు సందర్భంగా ఈ వీడియో వైరల్ గా మారింది.
2019లో సమంత తన 'ఓ బేబీ' సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఒక టీవీ షోలో పాల్గొన్నారు. ఆ షోలో ఆమెకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. సూర్య, నాగార్జునలలో ఎవరు ఎక్కువ అందగాడు అని అడిగితే, సమంత ఏ మాత్రం ఆలోచించకుండా, "నా మామగారే అత్యంత అందమైన వ్యక్తి" అని చెప్పింది. ఆమె నాగార్జున సినిమా 'మన్మథుడు 2' లో వచ్చిన ఒక డైలాగ్‌ను సరదాగా ప్రస్తావిస్తూ తన 'మామ' గారే ఈ సమాధానం ఇచ్చింది. తమ మధ్య ఉన్న ఆప్యాయతను గుర్తిచేసింది. ఈ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ మధ్య
ALSO READ : ఓటీటీలోకి మలయాళం గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్..
నాగ చైతన్య, సమంత ల వివాహం 2017లో జరిగింది. వారిద్దరూ కలిసి అద్భుతమైన జంటగా అభిమానులను ఆకట్టుకున్నారు. కానీ, 2021లో ఊహించని విధంగా వారిద్దరూ విడిపోయారు. ఈ వార్త అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత, డిసెంబర్ 4, 2024న నాగ చైతన్య నటి శోభితా ధూళిపాళను వివాహం చేసుకున్నారు. వారి పెళ్లి ఫోటోలను స్వయంగా నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు, సమంత కూడా తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సహ-దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నారని కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే, సమంత మేనేజర్ ఈ వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టివేశారు. ప్రస్తుతం సమంత తన నెక్ట్స్ మూవీపై దృష్టిపెట్టింది.