OTT Thriller: ఓటీటీలోకి మలయాళం గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Thriller: ఓటీటీలోకి మలయాళం గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రస్తుతం ఓటీటీ మూవీస్పై తెలుగు ఆడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డైరెక్ట్ తెలుగులో తెరకెక్కిన సినిమా అవ్వాల్సిన అవసరం లేకుండా అన్నీ సినిమాలు చూసేస్తున్నారు. ఎందుకంటే, కొన్ని సినిమాలు చూడాలంటే భాష, భావం, హీరోలు అనేది తేడా ఏమిలేదు. సినిమాల్లో ‘కథ, డ్రామా, క్రైమ్, హార్రర్, థ్రిల్లర్’వంటి అంశాలు ఉంటే చాలు. ఎంచక్కా ఆడియన్స్ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఈ క్రమంలో హిట్ కూడా కొట్టేస్తున్నారు. ఇపుడు సరిగ్గా అలాంటి థ్రిల్లింగ్ సినిమానే ఓటీటీ స్ట్రీమింగ్కి వచ్చింది. అదే ముర (Mura). 2024 నవంబర్లో థియేటర్లో మూవీ రిలీజై సూపర్ హిట్ అయింది. ఇవాళ (ఆగస్టు 29న) ఈ సినిమా ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ వివరాలేంటో చూసేద్దాం.

ముర ఓటీటీ: 

విలక్షణ నటుడు సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ముర. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇవాళ (ఆగస్టు 29న) సన్ నెక్ట్స్ (Sun NXT)లో స్ట్రీమింగ్కి వచ్చింది. “ఒక రాత్రి. ఒక లాకర్. ఒక షాట్ వాళ్ల జీవితాలను మార్చేస్తోంది. మురా సన్ నెక్ట్స్లో స్ట్రీమింగ్” అనే క్యాప్షన్తో సదరు ఓటీటీ సంస్థ ఈ విషయం వెల్లడించింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 

ముహ్మద్ ముస్తాఫా డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2024 డిసెంబర్ 20 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డైరెక్టర్ గతంలో కప్పెల మూవీతో ఆడియన్స్కి ఎంతో సుపరిచితం. ముర మూవీతో మరోసారి బాక్సాఫీస్ హిట్ కొట్టాడు డైరెక్టర్ ముహ్మద్ ముస్తాఫా.

ముర కథ: 

కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన స్టోరీగా ముర తెరకెక్కింది. నలుగురు ఉద్యోగాలు లేని యువత చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఆనందు, సాజీ, మను మరియు మనాఫ్.. అనే ఈ నలుగురు కుర్రాళ్ళు తమిళనాడులో అధిక స్టేక్స్ దోపిడీకి ప్లాన్ చేస్తారు. ఈ దోపిడీ కోసం ప్రయత్నించే క్రమంలో వాళ్ల జీవితాలు ఎలా మలుపు తిరిగాయన్నది ఈ మూవీలో ప్రధాన అంశంగా రూపొందించారు. థ్రిల్లింగ్ సీన్స్, యాక్ష‌న్ సీక్వెన్స్‌, ఛేజింగ్స్‌, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ని కట్టిపడేయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.