
అమెరికాలోని కోస్టారికా తీరంలో అద్భుతం.. అరుదైన షార్క్ చేప కనిపించింది. అన్ని షార్కుల్లా ఇది బూడిద రంగుల్లో లేదు.. మెరిసిపోయే ఆరెంజ్ కలర్ తో ఆకట్టుకుంటోంది..ఈ అరుదైన సొరచేప ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కోస్టారికా తీరంలో చేపలు పట్టే జాలర్లకు ఈ రేర్ షార్క్ పట్టుబడింది.37మీటర్ల సముద్రపు లోతులో ఈ అరుదైన షార్క్ దీనిని గుర్తించారు. ఇది నారింజ రంగులో ఉన్న మొట్టమొదటి చేప అని చెబుతున్నారు. ఈ షార్క్ ని చూసిన శాస్త్రవేత్తలు దాని కలర్ వెనక అసలు కారణాన్ని ఇలా చెబుతున్నారు.
షార్క్ ప్రశాశవంతమైన ఆరెంజ్ కలర్ వెనక జన్యుపరమైన కారణాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరెంజ్ కలర్ ఉండటం జాంథిజం అనే జన్యుపరమైన స్థితి వల్ల సంభవిస్తుందని అంటున్నారు. ఇది షార్క్ చర్మం లేదా పొలుసులు లలో పసుపు లేదా బంగారు వర్ణం ద్రవ్యం వల్ల కలుగుతుందని చెబుతున్నారు.
ఆగస్టులో వెలువడిన మెరైన్ బయోడైవర్సిటీ జర్నల్ లో ప్రచురించిన ఓ అధ్యయనంలో శాస్త్రవేత్తలు మారియెక్సిస్ మాకియాస్, కుయారే, గిల్బెర్టో రాఫెల్ బొర్గెస్ గుజ్మాన్ , డేనియల్ అరౌజ్ నరంజో లు ఈ సొర చేపగురించి ఇలా రాశారు. ఇది నర్స్ షార్క్ జాతులలో జాంథిజం మొదటిసారి గుర్తించినట్లు తెలిపారు. ఈ షార్కులో తెల్లటి కళ్లు దానికి వర్ణద్రవ్యం లేకపోవడం అనే ఆల్బినిజం కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో ఈ ఆరెంజ్ షార్క్ ఫొటోలు, వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇది అరుదైన షార్క్..అయితే ఈ సొరచేప ఎక్కువ కాలం జీవించదని కూడా చెబుతున్నారు శాస్త్రవేత్తలు.