
సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు.. శివంపేట బ్రిడ్జిపై నుంచి దూకి గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. శుక్రవారం (ఆగస్టు 29) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది ఈ ఘటన.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం శివంపేట బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు వ్యక్తి. ఆత్మహత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మధ్యాహ్నం తర్వాత ఆత్మహత్య చేసుకున్ననట్లు స్థానికులు చెబుతున్నారు.
చాలా సేపు బ్రిడ్జి సైడ్ గోడపై కూర్చున్న వ్యక్తి మెల్లిగా గోడ అవతలివైపుకు తిరిగి దూకేశాడు. రోడ్డుపై చాలా వాహనాలు వెళ్తున్నప్పటికీ ఎవరూ ఆపలేకపోయారు. దూకే ముందు గమనించిన ఇద్దరు వ్యక్తులు పరుగెత్తుకుంటూ వెళ్లే లోపే దూకేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది