
పాపం మూడేళ్ల చిన్నారి.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. తన వాళ్లు ఎవరైనా కనిపిస్తారేమోనని ఆ పాప చూసిన చూపులు అక్కడున్న వారి హృదయాలను కరిగించాయి. సెక్యూరిటీ సిబ్బంది చేరదీసి పాప వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
శుక్రవారం (ఆగస్టు 29) ఒంటరిగా తిరుగుతన్న పాపను సెక్యూరిటీ సిబ్బంది గమనించి చేరదీశారు. పేరు అడగగా కార్తీక అని చెబుతోందని సెక్యూరిటీ ఇంఛార్జ్ తెలిపారు. పాప వయసు మూడేళ్లు ఉంటుందని చెప్పారు.
చిన్నారి తల్లి పాపను గాంధీలో విడిచి పెట్టి వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. బహుశా తల్లికి మతిస్థిమితం లేకపోయి ఉండొచ్చని సిబ్బంది అంటున్నారు. పాపను గుర్తిస్తే వెంటనే సంప్రదించాలని కోరుతున్నారు.