పెద్దపల్లి జిల్లాలో ఆకట్టుకుంటున్న కరెన్సీ గణపతి.. 9,99,999 నోట్లతో అలంకరించిన నిర్వాహకులు

పెద్దపల్లి జిల్లాలో ఆకట్టుకుంటున్న కరెన్సీ గణపతి.. 9,99,999 నోట్లతో అలంకరించిన నిర్వాహకులు

వినాయక చవితి సందర్భంగా గణనాథుడిని వివిధ రూపాలలో తయారు చేసి అలంకరిస్తుంటారు భక్తులు. పెద్దపల్లి జిల్లాలో కరెన్సీ నోట్లతో అలంకరించిన గణనాధుడు భక్తులను ఆకట్టుకుంటున్నాడు. సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో కరెన్సీ నోట్లతో అలంకరించిన గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆర్యవైశ్యల ఆధ్వర్యంలో గణనాధుడికి 9,99,999  కరెన్సీ నోట్లతో అలంకరించారు నిర్వాహకులు.

గత కొన్ని సంవత్సరాలుగా ఇలా గణనాధుడికి కరెన్సీ నోట్లతో అలంకరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొమ్మిది లక్షల 99 వేల 999  రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించగా భక్తులను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. ఈ కరెన్సీ అలంకరణ లో 500 , 100, 50,  20, 10 రూపాయల నోట్లతో  అలంకరించారు నిర్వాహకులు. 

సుల్తానాబాద్ లో కరెన్సీ గణపతి ఇదొక స్పెషల్ అట్రాక్ట్ గా నిలిచింది. కరెన్సీతో అలంకరించిన గణేశుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున మండపానికి చేరుకున్నారు