
ముషీరాబాద్, వెలుగు: విశ్వబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్చారి డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీ కుల సంఘాల కేంద్ర కార్యాలయంతో పాటు దోమలగూడ, నాగారంలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. అనంతరం జయశంకర్సార్విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులకు అన్ని పార్టీలు ఎక్కువ సీట్లు కేటాయించాలని కోరారు. విశ్వబ్రాహ్మణులు లేని ఊరే లేదని, కానీ రాజకీయంగా ఉనికి లేకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య, శంకరాచారి, జయరాజ్, భిక్షపతి, చంద్రయ్య, సాయి, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.