శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 1.11 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

శంషాబాద్ విమానాశ్రయంలో రూ. 1.11 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

హైదరాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా కడ్డీల రూపంలో  రూ.1.11 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకొన్న డీఆర్ఐ అధికారులు  ఒక వ్యక్తిని  అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.

 గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూడైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ)అధికారులకు  పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. DRI  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం (నవంబర్ 15) తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడిని డీఆర్‌ఐ  అధికారులు సోదాలు జరిపారు.  విమారం అంతర్జాతీయ రన్ సమయంలో బంగారాన్ని స్మగ్గింగ్ చేసి దాచినట్లు నిందితుడు అంగీకరించాడు.  ఓ ప్రయాణికుడు కడ్డీల రూపంలో బంగాన్ని అక్రమంగా తరలిస్తుండగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో 
 DRI  అధికారులు రూ.1.11 కోట్లు  విలువ చేసే 1 కిలో 800 గ్రాములు బంగారం స్వాధీనం చేసుకున్నారు.

తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చిన ప్రయాణికులను తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక ప్రయాణికులపై అనుమానం వచ్చి అతనిని స్కానింగ్ చేయడంతో అతని వద్ద బంగారం ఉన్నట్లు DRI అధికారులు గుర్తించారు. ప్రయాణికుడు బంగారాన్ని కడ్డీల రూపంలో అక్రమంగా తీసుకొచ్చాడు.  నిందితుడిని అదుపులోకి తీసుకొని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.