హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలో కోటి రూపాయలకుపైగా విలువైన గంజాయి, డ్రగ్స్ ను ఎక్సైజ్ అధికారులు సోమవారం దహనం చేశారు. హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ. శాస్త్రి ఆదేశాల మేరకు ఎం/ఎస్ జీజేమల్టీకౌవ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ధ్వంసం చేశారు. దహనం చేసిన డ్రగ్స్, గంజాయి విలువ రూ.1.26 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. తొమ్మిది ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 102 కేసుల్లో ఈ మాదకద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు.
వీటిలో171.34 కేజీల గంజాయి, 21.03 కేజీల గంజాయి చాక్లెట్లు, 20కేజీల కుల్పీ, 320.6 గ్రాముల హషీస్ ఆయిల్, 51గ్రాముల ఓజీ కుష్, 17.66 గ్రాముల ఎండీఎంఏ,12 గ్రాముల కొకైన్ ఉంది. ఈ కార్యక్రమంలో ఏఈఎస్‌లు ఎన్. శ్రీనివాసరావు, ఎ. మోహన్ బాబు, అమీర్ పేట్, ధూల్‌పేట్, గొల్కోండ, జూబ్లీహిల్స్, కాచిగూడ, మలక్‌పేట్, ముషీరాబాద్, నారాయణగూడ, సికింద్రాబాద్ సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.
