
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జవాన్ (Jawan). తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), దీపికా పాడుకొనే(Deepika padukone) హీరోయిన్స్ గా నటించారు. భారీ అంచనాలున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలోనే జవాన్ అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్స్ (Advance Ticket Bookings) కూడా ఓపెన్ అయ్యాయి. పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న చిత్రం కావడంతో ‘జవాన్’ పై క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఈ నేపథ్యంలో జవాన్ అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్
ఓపెన్ అవ్వగానే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి టికెట్స్.
అలా అని టికెట్ రేట్స్ ఏమి తక్కువగా లేవు. రూ.1,600 నుంచి రూ.2,400 వరకు ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో జవాన్ టికెట్ ధర భారీగా ఉంది. మరీ ముఖ్యంగా ముంబై, ఢిల్లీ నగరాల్లో ఒక్కో టికెట్ ధర రూ.2,300 నుండి రూ.2.400 వరుకు ఉంది. ఇంత రేట్స్ పెట్టినా జనాలు మాత్రం ఈ సినిమా టికెట్స్ కోసం ఎగబడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే... ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది.