రూ.18 కోట్లతో చేపట్టే ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పనులు ప్రారంభం : ఎమ్మెల్యే పాయల్ శంకర్

రూ.18 కోట్లతో చేపట్టే ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పనులు ప్రారంభం : ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​పట్టణాన్ని అభివృద్ధిలో ముందుంచుతామని ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్​శంకర్​అన్నారు. పట్టణంలోని రవీంద్రనగర్​లో రూ.18 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్‌‌‌‌ డ్రెయిన్‌‌‌‌ నిర్మాణ పనులకు మున్సిపల్‌‌‌‌ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ బండారి అనూష, వార్డు కౌన్సిలర్ సూచికతో కలిసి భూమి పూజ చేశారు. 

పట్టణంలో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతో పాటు, తాగునీటి సమస్య లేకుండా చేస్తామని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సమన్వయంతో ఆదిలాబాద్ జిల్లాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.