ఖమ్మం ఖిల్లా రోప్ వేకు రూ.18 కోట్లు..మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ

ఖమ్మం ఖిల్లా రోప్ వేకు రూ.18 కోట్లు..మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లాలోని పార్కు, ఖిల్లా రోప్ వే డెవలప్​మెంట్ కోసం ప్రభుత్వం రూ.18 కోట్లు మంజూరు చేసింది. జీఓ నంబర్ 51 కింద  తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) ద్వారా నిధులు మంజూరు చేస్తూ.. మున్సిపల్ శాఖ సెక్రటరీ  టీకే శ్రీదేవి బుధవారం ఉత్తర్వులిచ్చారు. 

ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల అర్బన్ పార్క్ డెవలప్ మెంట్, నిర్వహణకు రూ.3 కోట్లు మంజూరు చేశారు. ఖమ్మం జిల్లా టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఖిల్లా నుంచి రోప్ వే అభివృద్ధి తదితరాలకు 15 కోట్లు ఇచ్చారు. నల్గొండ మున్సిపాలిటీలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పెండింగ్ బిల్లులు2.41కోట్లు చెల్లించడానికి అనుమతిస్తూ ఆమె జీవో జారీ చేశారు.