హోం క్వారంటైన్ బ్రేక్ చేస్తే రూ.2 వేలు ఫైన్

హోం క్వారంటైన్ బ్రేక్ చేస్తే రూ.2 వేలు ఫైన్

భోపాల్: హోం క్వారంటైన్ రూల్‌ బ్రేక్ చేసిన వారికి రూ.2,000 జరిమానా విధించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఉత్తర్వులిచ్చింది. మొదటిసారి హోం క్వారంటైన్ అతిక్రమించినవారికి రెండు వేలు ఫైన్ వేస్తామని, రెండోసారి ఉల్లంఘించినట్లయితే.. ఆ వ్యక్తిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్వారంటైన్ సెంటర్​కు తరలిస్తామని ప్రకటించింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం.. కరోనా లక్షణాలున్న వారు 14 రోజులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంది. బుధవారం రాత్రి వరకు మధ్యప్రదేశ్‌లో 7,261 కరోనా కేసులు నమోదు కాగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడి 313 మంది చనిపోయారు. 3,927 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.