మెదక్లో మున్సిపల్ అధికారుల దాడులు

మెదక్లో మున్సిపల్ అధికారుల దాడులు
  • .. స్వీట్​హౌస్​, పర్మిట్​రూమ్​లకు రూ.20,500 జరిమానాలు విధింపు

మెదక్​ టౌన్​, వెలుగు: మెదక్​ పట్టణంలోని అన్ని స్వీట్​హౌస్​, పర్మిట్ రూంలు, దుకాణాల్లో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. గురువారం జిల్లా కేంద్రం మెదక్​ పట్టణంలోని పలు స్వీట్​ షాపులు​, పర్మిట్​రూమ్​లు, టిఫిన్​ సెంటర్లపై ఇన్‌‌‌‌చార్జి  శానిటరీ ఇన్స్​పెక్టర్​నాగరాజు ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు చేశారు.

ఈ సందర్భంగా పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఉన్న బాలాజీ గణేశ్ స్వీట్​ హౌస్​కు రూ.10 వేలు, ఆటోనగర్​లోని బాలాజీ హర్షిత్​ స్వీట్​హోమ్​కు రూ.5 వేలు, ఆటోనగర్​లోని భద్రకాళి వైన్స్​కు సంబంధించి పర్మిట్​ రూమ్​కు రూ.5 వేలు, ఫతేనగర్​లోని సంధ్య టిఫిన్​ సెంటర్​కు రూ.500 జరిమానా విధించారు. అన్ని వార్డుల్లో వార్డు అధికారులతో  భువన్ సర్వే నిర్వహించినట్లు మున్సిపల్​ కమిషనర్​ శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు.