పద్మశ్రీ గ్రహీత‌‌‌‌ల‌‌‌‌కు రూ.25 వేల పింఛన్

పద్మశ్రీ గ్రహీత‌‌‌‌ల‌‌‌‌కు రూ.25 వేల పింఛన్

హైదరాబాద్, వెలుగు:  పద్మ శ్రీ గ్రహీతలకు రూ.25 వేల ప్రత్యేక పెన్షన్ ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇటీవ‌‌‌‌ల పురస్కారం అందుకున్న గ‌‌‌‌డ్డం స‌‌‌‌మ్మయ్య, దాస‌‌‌‌రి కొండ‌‌‌‌ప్పకు పింఛ‌‌‌‌న్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనుమరుగవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్ తరాలకు అందించే క‌‌‌‌ళాకారుల‌‌‌‌ను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప‌‌‌‌ర్యాట‌‌‌‌క‌‌‌‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌‌‌‌ల్లి కృష్ణారావు అన్నారు.

 అందులో భాగంగానే జీవో జారీ చేశామ‌‌‌‌ని పేర్కొన్నారు. పద్మ విభూషణ్, ప‌‌‌‌ద్మశ్రీ పుర‌‌‌‌స్కార విజేత‌‌‌‌ల‌‌‌‌కు స‌‌‌‌న్మాన కార్యక్రమంలో ప‌‌‌‌ద్మశ్రీ గ్రహీత‌‌‌‌ల‌‌‌‌కు రూ.25 వేల పెన్షన్ ఇస్తామ‌‌‌‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్రక‌‌‌‌టించార‌‌‌‌ని గుర్తు చేశారు. ఇచ్చిన మాట‌‌‌‌కు క‌‌‌‌ట్టుబ‌‌‌‌డి ఉత్తర్వులు జారీ చేశామ‌‌‌‌ని చెప్పారు. భాష‌‌‌‌, సాంస్కృతిక శాఖ ద్వారా వీరికి పింఛ‌‌‌‌న్ డ‌‌‌‌బ్బులు నేరుగా వారి ఖాతాల్లో జ‌‌‌‌మ చేయ‌‌‌‌నున్నారు.