
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్‌లోని సురానా జ్యువెలర్స్‌పై ఆదాయపు పన్ను శాఖ మే 26వ తేదీ ఆదివారం దాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని సంపదకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదాయపు పన్ను శాఖ పలు బృందాలుగా ఏర్పడి.. సురానా జ్యువెలర్స్ యజమాని ఇంటితోపాటు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన ఈ ఆపరేషన్.. గత శుక్రవారం నుంచి జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా, బులియన్ వ్యాపారి వద్ద ఇంత ఆస్థులు బయటపడటం చర్చలకు దారితీసింది. ప్రస్తుతం, వ్యాపారవేత్తకు సంబంధించిన లెక్క చూపని ఆస్తుల వివరాలను సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.