వేములవాడ అభివృద్ధికి ప్రణాళిక : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడ అభివృద్ధికి ప్రణాళిక : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: వెనుకబడిన వేములవాడను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని మల్లారం రోడ్డు చౌరస్తా నుంచి బతుకమ్మ తెప్ప మీదుగా జగిత్యాల బస్టాండ్ వరకు రూ.2.60 కోట్లతో డివైడర్ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు.

కార్యక్రమంలో మార్కెట్​కమిటీ చైర్మన్​రొండి రాజు, వైస్​ చైర్మన్​ రాకేశ్‌‌‌‌, చంద్రగిరి శ్రీనివాస్‌‌‌‌గౌడ్​ పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో ‘మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్’, మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డితో కలిసి ఆది శ్రీనివాస్‌‌‌‌ బహుమతులు అందజేశారు.

​డిప్యూటీ సీఎంను కలిసిన విప్​

 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హైదరాబాద్‌‌‌‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి అంశాలపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా మేడిపల్లి మండలం కాచారం గ్రామంలో 220 కేవీ సబ్‌‌‌‌స్టేషన్‌‌‌‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు.