
న్యూఢిల్లీ: కరోనాతో తీవ్రంగా బాధపడుతున్న వారికి ట్రీట్‌మెంట్ చేయడానికి రెమ్డిసివిర్ డ్రగ్ ను ఫార్మా కంపెనీ జైడస్ కాడిలా గురువారం లాంఛ్ చేసింది. ఈ డ్రగ్ ను రెమ్డెక్ బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 100 ఎంజీ బాటిల్(డ్రగ్ వైల్) ధరను రూ2,800 గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న రెమ్డిసివిర్ డ్రగ్ లలో రెమ్డెక్ ధరే తక్కువని జైడస్ కాడిలా చెబుతోంది. కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు ఈ డ్రగ్ ను వీలున్నంత తొందర్లో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ కు డిస్ట్రిబ్యూట్ చేస్తామని కంపెనీ పేర్కొంది. కరోనా పేషెంట్లందరికీ అందుబాటులో ఉండేందుకు రెమ్డెక్‌ను అఫర్డబుల్ ధరలో తీసుకొచ్చామని కాడిలా హెల్త్‌కేర్ ఎండీ శర్విల్ పటేల్ అన్నారు.