మహిళలకు 3 లక్షల రుణం.. పైలట్ ప్రాజెక్టుగా పాలకుర్తి : ఎర్రబెల్లి

 మహిళలకు 3 లక్షల రుణం.. పైలట్ ప్రాజెక్టుగా పాలకుర్తి  : ఎర్రబెల్లి

జనగామ: మహిళలకు 3 లక్షల రూపాయల రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నామని, ఇందుకోసం తొలుత పైలట్ ప్రాజెక్ట్ గా పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంపిక చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయ్యాక తెలంగాణ రాష్ట్రం అంతటా అమలు చేస్తామని చెప్పారు. జనగామలో దాదాపు 3 వేల మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ఇవాళ హాజరయ్యారు.  ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆధ్వర్యంలో మహిళలకు మంత్రి  కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి.. పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామాల్లోని మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి, శిక్షణ కూడా ఇస్తామని మంత్రి వివరించారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.