
చాలామంది టేస్టీ ఫుడ్స్ తినడానికి ఇష్టపడుతుంటారు.కొందరు తిండికే ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. తాజాగా చైనా మహిళ తొమ్మిదేళ్లలో తన తిండికి 32 లక్షల రూపాయిలను ఖర్చు చేసింది. తనకు ఇష్టమైన ఫుడ్‌ను హోటల్లో ఆర్డరిచ్చి తెప్పించుకొని తినేది.
వివరాల్లోకి వెళ్తే.... చైనాకు చెందిన కాంగ్ అనే హోటల్ మేనేజర్ హైదిలావ్( Haidilao ) అనే ప్రసిద్ధ రెస్టారెంట్ చైన్ నుంచి తనకు ఇష్టమైన వంటకం హాట్‌పాట్ తినడానికి తొమ్మిదేళ్లలో రూ.32 లక్షలు ఖర్చు చేసింది.ఆమె అక్కడ 627 సార్లు భోజనం చేసిందని తెలిపింది.
హాట్‌పాట్ అనేది చైనాలో( China ) ఒక పాపులర్ ఫుడ్. ఇందులో టేబుల్ మధ్యలో ఉడకబెట్టిన పులుసులో ముడి పదార్థాలను వండుతారు. హైడిలావ్ స్పైసీ సిచువాన్ ఫుడ్ అద్భుతమైన సేవకు ప్రసిద్ధి చెందింది. ఈ రెస్టారెంట్ ఫ్రెష్ ఫుడ్స్, ఆతిథ్యం తనను ఎంతగానో ఆకట్టుకుందని కాంగ్ చెప్పింది.
ఎక్కువ హాట్‌పాట్ తినడం తన ఆరోగ్యం, బరువును ప్రభావితం చేసిందని కాంగ్ తెలిపింది.ఆమె 13.5 కిలోల బరువు పెరిగింది.ఆమె బాడీ చెకప్ చేయించుకోగా, కొన్ని అసాధారణ అనారోగ్య సంకేతాలు కూడా ఉన్నాయని తేలింది. శరీరంలో లిథిక్ యాసిడ్( Lithic acid ) అధికంగా ఉండటం వల్ల గౌట్ వచ్చే ప్రమాదం ఉందని ఆమె చెప్పారు.ఆమె తన హాట్‌పాట్ వినియోగాన్ని తగ్గించుకోవాలని యోచిస్తోంది.కానీ దాని రుచిని ఆమె మర్చిపోలేకపోతోంది.