- 78 ఏళ్ల కేరళ వ్యక్తిని టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు
న్యూఢిల్లీ: ఫేక్ సైట్ అని తెలియక ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్ క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించి రూ.4 లక్షలు మోసపోయారు కేరళకు చెందిన ఓ వ్యక్తి. రిపోర్ట్స్ ప్రకారం ఐఆర్‌సీటీసీ ఒరిజినల్ సైట్‌లా ఉండే ఫేక్ సైట్‌లో 78 ఏళ్ల ఎం మహ్మద్ బషీర్ లాగిన్ అయ్యారు. రైల్వే అధికారులమని చెప్పుకునేవారు కాల్ చేసి ఆయన్ని ట్రాప్ చేశారు. ‘వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యాక రైల్వే అధికారులమని చెప్పుకునేవారి నుంచి కాల్ వచ్చింది. ఇంగ్లిష్, హిందీలో ఆ ఉద్యోగి మాట్లాడారు. ‘రెడ్ డెస్క్’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఈ యాప్ ద్వారానే బషీర్ ఫోన్‌ను సైబర్ మోసగాళ్లు హ్యాక్ చేశారు. అంతేకాకుండా బషీర్ తన బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డ్ డిటైల్స్‌ను మోసగాళ్లతో పంచుకున్నారు’ అని మాతృభూమి రిపోర్ట్ చేసింది.
డిటెయిల్స్ షేర్ చేసుకున్న కొన్ని నిమిషాలకే బ్యాంక్ అకౌంట్‌లోని రూ.4 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ విత్‌డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. సైబర్ మోసగాళ్లు మూడు వేరు వేరు నెంబర్ల నుంచి మహ్మద్ బషీర్‌ను కాంటాక్ట్ అయ్యారని, మొదట ఆయన బ్యాంక్‌ను సంప్రదిద్దామని ప్రయత్నిస్తే అడ్డుకున్నారని కోజికొడ్ పోలీసులు వివరించారు. తర్వాత బషీర్ తన ఫోన్‌ను ఫార్మాట్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. రెస్ట్ డెస్క్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారానే బషీర్ ఫోన్‌ను స్కామర్లు హ్యాక్ చేయగలిగారని, ఆయన బ్యాంక్ అకౌంట్‌లోని రూ.4,05,919 కోల్‌కతాలోని నాలుగు వేరువేరు అకౌంట్లకు వెళ్లాయని పోలీసులు చెప్పారు. ఈ స్కామర్లు బెంగాల్, బిహార్‌కు చెందినవారిగా అనుమానిస్తున్నామని అన్నారు. ఫేక్, మాలిషియస్ మొబైల్ యాప్‌లు ఉన్నాయని, మోసగాళ్లు ఫిషింగ్ లింక్స్ పంపుతున్నారని జాగ్రత్త అని ఐఆర్‌సీటీసీ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన తర్వాత రోజే ఈ ఘటన జరిగింది.