వేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.40 లక్షల ఆభరణాలు చోరీ

వేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.40 లక్షల ఆభరణాలు చోరీ

జీడిమెట్ల, వెలుగు: వేంకటేశ్వర స్వామి ఆలయంలో చొరబడిన ఇద్దరు దొంగలు గుడి తాళాలు పగలగొట్టి స్వామివారి బంగారు నగలు, వెండి విగ్రహాలను దొంగలించారు. కూకట్​పల్లి సర్ధార్​పటేల్​నగర్​లోని వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్దకు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చారు. గుడి తాళాలను కట్టర్​తో పగులగొట్టి గర్భగుడిలోకి వెళ్లారు. 

స్వామివారి మూల విరాట్​కి సంబంధించిన సుమారు 13 కిలోల వెండి విగ్రహాలు, శంకు చక్రాలతో పాటు బంగారం ఆభరణాలు దొంగలించి సూట్​ కేసులో పెట్టుకుని పారిపోయారు. ఉదయం పూజ చేయడానికి వచ్చిన పూజారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయాన్ని కూకట్​పల్లి ఏసీపీ రవికిరణ్​ పరిశీలించారు.