- అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన పోలీసులు
బషీర్బాగ్,వెలుగు: నకిలీ స్టాక్ -ట్రేడింగ్ సంస్థ పేరుతో రూ.కోట్లు దోచుకున్న ఓ వ్యక్తిని సీసీఎస్, డీడీ స్పెషల్ జోనల్ క్రైమ్ టీం అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ డీసీపీ శ్వేత తెలిపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన నామాని కార్తీక్ ఎక్స్‌ప్లోర్ టెక్నాలజీస్ పేరుతో నెలకు 6 నుంచి -20 శాతం వరకు లాభాలు వస్తాయని నమ్మించి పలువురి వద్ద పెట్టుబడులు పెట్టించాడు.
నగరానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డి.శివకుమార్ నుంచి రూ.1.35 కోట్లతో పాటు మరో కొందరి వద్ద మొత్తం రూ.4.36 కోట్లు వసూలు చేశారు. ఆ తరువాత అందుబాటులో లేకుండా పోయాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఈ నెలల 22న విద్యానగర్లో అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రిమాండ్కు తరలించారు.
