మాస్కు ధరించని దుకాణాదారునికి 500 జరిమానా

మాస్కు ధరించని దుకాణాదారునికి 500 జరిమానా

జగిత్యాల జిల్లా: మాస్కు ధరించకుండా దుకాణం నడుపుతున్న వ్యక్తికి రూ.500 జరిమానా విధించిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో జరిగింది. కరోనా రెండో దశ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో ఆంక్షలు విధిస్తున్న అధికారులు వాటి అమలును పట్టించుకోవడం లేదన్న విమర్శల నేపధ్యంలో కొరడా ఝుళిపించడం ప్రారంభించారు. ప్రచారంలో చెప్పినట్లుగానే తనిఖీలు చేస్తూ జరిమానాలు విధిస్తూ వస్తున్నారు. అయితే వంద రూపాయల జరిమానాను చాలా మంది ఖాతరు చేయకపోవడంతో మెట్ పల్లిలో జరిమానా .500కు పెంచారు. మంగళవారం మెట్ పల్లిలో రెగ్జిన్ వర్క్స్ షాప్ నడుపుతున్న రాజ్ కుమార్ అనే వ్యక్తి మాస్క్ ధరించకపోవడం గుర్తించిన అధికారులు కోవిడ్ -19 నిబంధనల ప్రకారం 500 రూపాయల జరిమానా విధించారు. మొదటి తప్పుగా జరిమానాతో సరిపెట్టామని.. రెండోసారి జరిమానా మరింత భారీగా ఉంటుందని మెట్ పెల్లి పురపాలక సంఘం అధికారులు హెచ్చరించారు.