ఈదులగూడెంలో రూ. 5.73 కోట్ల బంగారం పట్టివేత 

ఈదులగూడెంలో రూ. 5.73 కోట్ల బంగారం పట్టివేత 
  • మిర్యాలగూడ నుంచి వరంగల్  తరలిస్తున్నట్లు సమాచారం 
  • సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసిన పోలీసులు 

మిర్యాలగూడ, వెలుగు : లోక్​సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఈదులగూడెం వద్ద డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. పోలీసుల కథనం ప్రకారం...ఎలక్షన్ కోడ్ అమలులో భాగంగా సోమవారం పోలీసులు  సీక్వెల్​ గ్లోబల్​ ప్రీసియస్​లాజిస్టిక్స్​కంపెనీకి చెందిన సెక్యూరిటీ వాహనంలో తనిఖీలు చేశారు.

అందులో సుమారు రూ. 5.73 కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. అయితే ఈ బంగారాన్ని మిర్యాలగూడ నుంచి కోదాడ మీదుగా వరంగల్ తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన బంగారానికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వన్ టౌన్ సుధాకర్, ఎస్ఐ శ్రీను నాయక్, కానిస్టేబుల్స్​ సైదులు, హుస్సేన్, నాగరాజు ఉన్నారు.