రూ.8 కోట్ల లగ్జరీ షిప్.. సముద్రంలోకి ఎంటరైన నిమిషాల్లోనే మునిగిపోయింది.. వీడియో వైరల్

రూ.8 కోట్ల లగ్జరీ షిప్.. సముద్రంలోకి ఎంటరైన నిమిషాల్లోనే మునిగిపోయింది.. వీడియో వైరల్

టూరిస్టుల కోసం.. ఎంతో ప్రెస్టీజియస్ గా.. కోట్లు ఖర్చు చేసి తయారు చేసిన లగ్జరీ నౌక సముద్రంలో మునిగిన వీడియో వైరల్ గా మారింది. కొటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 కోట్లకు రూపాయలకు పైగా ఖర్చు చేసి తయారు చేసిన షిప్.. లాంచ్ చేసిన నిమిషాల వ్యవధిలోనే సముద్రంలో మునిగిపోయింది. టర్కీలో తీరంలో జరిగిన ఈ ఘటన విజువల్స్ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. 

సెప్టెంబర్ 2 న టర్కీ తీరంలో జరిగింది ఈ ఘటన. జోంగుల్డాక్ తీరంలో దోల్స్ వెంటో అనే లగ్జరీ షిప్.. ప్రారంభించిన 15 నిమిషాలకే తీరానికి 24 మీటర్ల దూరంలో బోల్తో పడిపోయింది. దీంతో షిప్పులో ఉన్న  ప్రయాణికులు బతుకు జీవుడా అంటూ నీళ్లలోకి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే కోస్ట్ గార్డులు, వైద్య సిబ్బంది వెంటనే షిప్పు దగ్గరకు చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. బోట్ ((BOAT) ఇంటర్నేషనల్ రిపోర్టు ప్రకారం.. షిప్ లో నలుగురు ఉన్నారు. షిప్ ఓనర్, క్యాప్టెన్, ఇద్దరు క్రూ మెంబర్లు ఆ సమయంలో షిప్ లో ఉన్నారు. ప్రమాద సమయంలో వెంటనే తేరుకుని నీళ్లలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. 

షిప్ మునకకు కచ్చితమైన కారణాలు తెలియలేదు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. షిప్ స్టెబిలైజేషన్ ఇష్యూ (నీళ్లలో స్థిరంగా నిలబడే సామర్థ్యం) కారణంగా పక్కకు  ఒరిగి మునిగినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టారు.