రూ. 8 కోట్ల కుక్క దొంగతనం.. పట్టిస్తే లక్ష..

రూ. 8 కోట్ల కుక్క దొంగతనం.. పట్టిస్తే లక్ష..

దొంగిలించబడ్డ తన కుక్కను పట్టించిన వారికి రూ. లక్ష బహుమతి ఇస్తానని బెంగుళూరుకు చెందిన చేతన్ అనే వ్యక్తి ప్రకటించాడు. బెంగుళూరులో నివాసముండే చేతన్ తన కుక్కను ఎవరో దొంగిలించారని హనుమంతనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన కుక్క అలస్కాన్ మాలమ్యూట్ జాతికి చెందినదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దొంగతనం చేయబడ్డ తన కుక్క ఖరీదు అక్షరాల రూ. 8 కోట్లని చేతన్ తెలిపాడు. అలస్కాన్ మాలమ్యూట్ జాతికి చెందిన కుక్కలకు చాలా ఖరీదు ఉంటుంది.

https://www.aninews.in/news/national/general-news/bengaluru-man-claims-his-alaskan-malamute-dog-worth-rs-8-cr-stolen-files-complaint20191223070424/