కాంగ్రెస్ కంచుకోట బద్దలు కొట్టిన సైదిరెడ్డి

కాంగ్రెస్ కంచుకోట బద్దలు కొట్టిన సైదిరెడ్డి

జూర్ నగర్ బైపోల్ లో టీఆర్ ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ విజయం సాధించారు.కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి పై 43,284 ఓట్ల తేడాతో గెలిచారు. అన్ని మండలాల్లో సైదిరెడ్డి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ప్రతీ రౌండ్ లోనూ టీఆర్ఎస్ కే ఆధిక్యం వచ్చింది. 22వ రౌండ్ ముగిసే సరికిటీఆర్ ఎస్ కు 1,12,796 ఓట్లు, కాంగ్రెస్ 69,563, బీజేపీ 2621, టీడీపీ 1827 స్వతంత్ర అభ్యర్థి హెల్మెట్ గుర్తు సుమన్ కు 2693 ఓట్లు వచ్చాయి.

హుజూర్ నగర్ 2009 నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కంచుకోటగా ఉంది. 2009,2014,2018 ఎన్నికల్లో వరుసగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచాడు.  ఇపుడు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించి కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టారు.