సందేశాత్మకంగా ‘పోలీస్ వారి హెచ్చరిక’.. జులై 18న రిలీజ్

సందేశాత్మకంగా ‘పోలీస్ వారి హెచ్చరిక’.. జులై 18న రిలీజ్

సన్నీ అఖిల్ హీరోగా అభ్యుదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మించిన చిత్రం ‘పోలీస్ వారి హెచ్చరిక’. తాజాగా ట్రైలర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. నిర్మాత కేఎల్ దామోద్ ప్రసాద్, దర్శకుడు సముద్ర, నటి ఇంద్రజ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ ‘సాధారణంగా చిన్ననాటి నుండి మనల్ని పెద్దవారు ఏదో ఒక విషయంలో హెచ్చరిస్తూ ఉంటారు. దానిని మనం మంచికి తీసుకుని ముందుకు వెళ్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది.

పోలీసు వారు ఏదైనా హెచ్చరించినప్పుడు దానిని పాటిస్తే అది మనకే మంచిది. ఈ సినిమాలో అన్ని కోణాలు ఉన్నాయి. మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ఇదొక సందేశాత్మక చిత్రమని దర్శక నిర్మాతలు చెప్పారు. అజయ్ ఘోష్, రవి కాలే, షియాజీ షిండే,  కాశీ విశ్వనాథ్ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రం జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.