
బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో స్పీడ్‌గా సినిమాలు చేసే హీరోల్లో మలయాళ స్టార్ మోహన్ లాల్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా తన 365వ చిత్రాన్ని మంగళవారం ప్రకటించారు. ‘ఎల్ 365’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆస్టిన్ డాన్ థామస్ దర్శకత్వం వహిస్తుండగా, రితేష్ రవి కథను అందించాడని, ఆషిక్ ఉస్మాన్ నిర్మిస్తున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇందులో వాష్ రూమ్‌ను చూపిస్తూ, ఓ సింక్, అద్దంతో పాటు హ్యాంగర్‌కు పోలీస్ యూనిఫామ్ తగిలించి ఉండటంతో ఇదొక థ్రిల్లర్ కథ అని తెలుస్తోంది. అలాగే అద్దంపై ‘ఎల్ 365’ పేరుతో దర్శక నిర్మాతల పేర్లను ఉంచారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. మరోవైపు మోహన్ లాల్ ఇప్పటికే హృదయపూర్వం, వృషభ చిత్రాలను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. అలాగే మరో రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉండగా, ‘దృశ్యం3’ సెప్టెంబర్‌లో సెట్స్‌కు వెళ్లనుంది.