
సిద్ధార్థ్ హీరోగా శరత్ కుమార్, దేవయాని కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రీ బీహెచ్‌కే’. శ్రీగణేష్ దర్శకత్వంలో అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా జులై 4న విడుదలైంది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోందని తెలియజేసిన మేకర్స్.. మంగళవారం థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘ఒక క్లాసిక్ సినిమాకి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఈ సినిమాకు ఉన్నాయి. ఇందులో ఉండే ఎలిమెంట్స్ అందరూ రిలేట్ చేసుకుంటున్నారు. ఆడియెన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పాడు.
ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ కనెన్ట్ అవుతున్నారని దేవయాని చెప్పారు. ఈ సినిమాకు అద్భుతమైన రివ్యూస్ వచ్చాయని, సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్ అని దర్శకుడు శ్రీగణేష్ అన్నాడు. నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ ‘తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాం’ అని చెప్పారు. నటి చైత్ర, మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ రామ్‌నాథ్ పాల్గొన్నారు.