కిషన్ రెడ్డికి కంగ్రాట్స్ చెప్పిన ఆర్ఎస్ ​ప్రవీణ్

కిషన్ రెడ్డికి కంగ్రాట్స్ చెప్పిన ఆర్ఎస్ ​ప్రవీణ్

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన కిషన్​రెడ్డికి బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​ ట్విట్టర్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఎవరిని ఏ పదవిలో  నియమించుకోవాలో పూర్తిగా బీజేపీ అంతర్గత విషయమన్నారు. 

బహుజనులకు న్యాయం, గుర్తింపు, గౌరవం మాత్రం కేవలం బీఎస్పీలోనే దొరుకుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని ప్రవీణ్​కుమార్​ ట్వీట్​ చేశారు.