కేసీఆర్ ఎలక్షన్ కమిషన్ను కూడా మోసం చేసిండు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్  ఎలక్షన్ కమిషన్ను కూడా మోసం చేసిండు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలనే కాకుండా ఎలక్షన్ కమిషన్ ను కూడా మోసం చేశారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 2018 ఎన్నికల్లో గజ్వేల్ నుండి పోటీ చేసిన కేసీఆర్ ..  తన అఫిడవిట్ లో స్థిరాస్తుల వివరాలు వెల్లడించలేదన్నారు. లక్డికపుల్ లోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో ఆయన మాట్లాడారు. 

సామాన్యులు నామినేషన్ పత్రాలలో ఏదైనా చిన్న తప్పు చేసి ఉంటే , రిజెక్ట్ చేసే అధికారులకు కేసీఆర్ తన స్థిరాస్తుల వివరాలు తెలుపకున్న ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కేసీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి , ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.  ఈ విషయంపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా 25 మంది సభ్యుల ఎమ్మెల్యే అభ్యర్థుల మూడవ జాబితాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 87 మంది అభ్యర్థులను ప్రకటించింది బీఎస్పీ.  ఎస్సీలకు 32 సీట్లు, బీసీలకు 33 సీట్లు, ఎస్టీలకు 13 సీట్లు, జనరల్‌ అభ్యర్థులకు 4 సీట్లు, మైనారిటీలకు 5 సీట్లు ఇచ్చింది బీఎస్పీ. 

ALSO READ :- డీకే.. ఇదేనా నీతి : ఫ్యాక్స్ కాన్ సీఈవోకు లేఖ బయటపెట్టిన కేటీఆర్