బీసీలకు 60 నుంచి 70 సీట్లు ఇస్తం

బీసీలకు 60 నుంచి 70 సీట్లు ఇస్తం
  • వట్టే జానయ్య యాదవ్ కు ప్రాణహాని ఉంది
  • ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి
  • ఇంటెలిజెన్స్ కేసీఆర్ ఇంటి కోసమే పనిచేస్తోంది
  • అందుకే పోలీసు అధికారి దుగ్యాల ప్రణీత్ రావుకు ప్రమోషన్
  • ఆయన ప్రమోషన్ మీద విచారణ జరగాలి
  • బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 60 నుంచి 70 సీట్లను కేటాయిస్తామని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. త్వరలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తా మని చెప్పారు. ఇవాళ బీఎస్పీ రాష్ట్ర కార్యా యలంలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చీకటి దందాను అడ్డుకున్నందుకే సూర్యాపేటలో బీసీ నేతవట్టే జానయ్యయాదవ్ పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. వట్టే జానయ్య యాదవ్ కు మంత్రి జగదీశ్ రెడ్డితో ప్రాణ హనీ ఉందన్నారు. 

వట్టే జానయ్య యాదవ్ పి.డి కేసు నమోదు చేసేందకు పోలీసలు కుట్రలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనలో బీసీ నాయకులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. బీఆర్ఎస్ లోని బీసీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ పై తిరుగుబాటు చేయాలని ఆర్ఎస్పీ పిలుపుని చ్చారు. ఇంటలిజెన్స్ అధికారులు కేసీఆర్ఇంటికి కోసమే పనిచేస్తున్నారన్నారు. ప్ర భుత్వం ప్రతిపక్ష నేతల మొబైల్ ఫోన్లు ప్రభు త్వం ట్యాప్ చేస్తున్నదని చెప్పారు. ప్రతిపక్ష నేతల మొబైల్ ఫోన్లు ట్యాప్ చేసినందుకే పోలీసు అధికారి దుగ్యాల ప్రణీత్ రావు కు ప్రమోషన్ ఇచ్చారని ఆర్ఎస్పీ ఆరోపించా రు. పోలీసు అధికారి దుగ్యాల ప్రణీత్ రావు ప్రమోషన్ పై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 30 వేల ఎకరాల పేదల అసైన్డ్ భూములను బలవంతంగా గుంజు కుటుందన్నారు.