రూ. 20 వేలు ట్రాన్స్ ఫర్ చేయించుకుని పారిపోయిండు

రూ. 20 వేలు ట్రాన్స్ ఫర్ చేయించుకుని పారిపోయిండు

ఓయూ,వెలుగు: ఫోన్​పే ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకుని పారిపోయిన యువకుడిని ఓయూ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ.20వేల నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఓయూ డివిజన్​ఏసీపీ జగన్​ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.  కుత్బుల్లాపూర్​పరిధి షాపూర్​ నగర్​లో ఉండే మహ్మద్​ సబీల్​(33) ర్యాపిడో డ్రైవర్. మద్యానికి బానిసగా మారిన అతను ఆన్​లైన్​బెట్టింగ్​గేమ్స్​కు అలవాటు పడ్డాడు. దీంతో ర్యాపిడో ద్వార వచ్చే ఆదాయం  తన జల్సాలకు సరిపోవడం లేదు. దీంతో మోసాలకు దిగాడు. 

ఈనెల 5న తన బైక్​పై తార్నాకలోని ఇండియన్ పెట్రోల్​ బంక్​కు వచ్చిన సబీల్​ అందులో పనిచేసే సుమిత్​ రాయ్​వద్దకు వెళ్లి అర్జంటుగా మిత్రుడికి డబ్బులు పంపాలని, రూ.20వేలు  ఆన్​లైన్​లో పంపిస్తే వెంటనే లిక్విడ్​క్యాష్​ ఇస్తానని నమ్మించాడు.  దీంతో  సుమిత్​రాయ్​ ఫోన్​పే ద్వారా అతడు అడిగినంత ట్రాన్స్​ఫర్​ చేశాడు. 

డబ్బులు ఇవ్వకుండా బైక్​ను స్టార్ట్​చేసి ఉడాయించాడు. సబీల్​ను పట్టుకునేందుకు వెంబడించిన సుమిత్ ను తోసేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం హబ్సిగూడలో  వాహనాలు చెకింగ్ లో  చిక్కిన సబీల్​ను అదుపులోకి తీసుకుని విచారించగా అంగీకరించాడు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు.