టీసీఎస్​లో జాబ్స్​ స్కామ్.. రూ. 100 కోట్లని అంచనా

టీసీఎస్​లో జాబ్స్​ స్కామ్.. రూ. 100 కోట్లని అంచనా
  • నలుగురు ఉద్యోగుల తొలగింపు
  • సెలవుపై రిక్రూట్​మెంట్​ హెడ్​

బెంగళూరు: గత మూడేండ్లలో సగటున 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన టీసీఎస్​లో జాబ్స్​ స్కామ్ బయటపడింది. హైరింగ్​ డిపార్ట్​మెంట్​లోని సీనియర్​ ఉద్యోగులు కొందరు లంచాలు తీసుకుని వేలాది మందికి జాబ్స్​ ఇచ్చినట్లు తేలింది. రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​లో అవకతవకలకు ఆ సీనియర్​ ఉద్యోగులు పాల్పడినట్లు తెలుస్తోంది. స్కామ్​ వివరాలు పూర్తిగా ఇంకా బయటకు రాలేదు. కానీ, రిసోర్స్​ మేనేజ్​మెంట్​ గ్రూప్​ (ఆర్​ఎంజీ)  గ్లోబల్ హెడ్​ ఈ ఎస్​ చక్రవర్తి స్టాఫింగ్​ కంపెనీల నుంచి కమీషన్లు తీసుకుంటున్నట్లు ఒక విజిల్​ బ్లోయర్​ టీసీఎస్ సీఈఓ, సీఓఓలకు తెలియచేయడంతో జాబ్​ స్కామ్​ వెల్లడైందని ఇద్దరు ఎగ్జిక్యూటివ్​లు చెప్పారు. విజిల్​ బ్లోయర్​ కంప్లయింట్​తో మేలుకొన్న కంపెనీ చీఫ్​ ఇన్ఫర్మేషన్​ సెక్యూరిటీ ఆఫీసర్​ అజిత్​ మీనన్​ నాయకత్వంలో   ముగ్గురు ఎగ్జిక్యూటివ్స్‌​తో దర్యాప్తు కోసం   ఒక టీమ్​ను ఏర్పాటు చేసింది.

కొన్ని వారాల దర్యాప్తు తర్వాత రిక్రూట్​మెంట్​హెడ్​ను టీసీఎస్​ సెలవుపై పంపించింది. ఆర్​ఎంజీ లోని నలుగురు ఉద్యోగులపై వేటు వేయడంతోపాటు, మూడు స్టాఫింగ్​ కంపెనీలను బ్లాక్​లిస్టులో నూ పెట్టింది. స్కామ్​ ఎంత మేరకు జరిగిందనే వివరాలు పూర్తిగా తేలకపోయినా స్కామ్​కు పాల్పడిన ఉద్యోగులు కమీషన్ల రూపంలో కనీసం రూ. 100 కోట్ల దాకా సంపాదించి ఉంటారని ఒక ఉద్యోగి వెల్లడించారు. ఉద్యోగులు కోడ్​ ఆఫ్​ కండక్ట్​ అతిక్రమించడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుందని, దర్యాప్తు చేసి రిజాల్వ్ చేయడానికి తగిన ప్రాసెస్​ కంపెనీలో ఉందని టీసీఎస్​ స్పోక్స్​పర్సన్​ చెప్పారు. మూడు వేల మంది ఉద్యోగులుండే ఆర్​ఎంజీ డివిజన్​ రోజుకి 1,400 మంది ఇంజినీర్లను హైర్​ చేస్తుంది. టీసీఎస్​లో రిక్రూట్​మెంట్​ స్కామ్​ బయటపడటం ఇదే మొదటిసారి. ఈ స్కామ్​ కంపెనీలోని సీనియర్​ లీడర్​షిప్​ను షాక్​కు గురిచేసిందని ఒక ఉద్యోగి పేర్కొన్నారు.