
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హైడ్రోఫోనిక్ గంజాయి పట్టుబడింది. దుబాయ్నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలిని తనిఖీ చేయగా, ఆమె బ్యాగ్లో రూ. 12 కోట్ల విలువ చేసే 12 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని గుర్తించినట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. మహిళను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.