పల్లె, పట్టణ ప్రగతికి ఒక్కో జిల్లాకు రూ.కోటి

పల్లె, పట్టణ ప్రగతికి ఒక్కో జిల్లాకు రూ.కోటి

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు నిధులు విడుదల చేసింది సర్కార్. ఒక్కో జిల్లాకు కోటి రూపాయల చొప్పున మొత్తం 32 కోట్లు రిలీజ్ చేసింది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు వీటిని వినయోగించాలని సర్కార్ సూచించింది. అయితే.. జిల్లాకు కోటి రూపాయలు ఏమాత్రం సరిపోవంటున్నారు విపక్ష నేతలు. ఈ నిధుల్లో గ్రామానికి లక్ష కూడా వచ్చే పరిస్థితి లేదని విమర్శిస్తున్నారు. జిల్లాకు కోటి నిధులతో పల్లె, పట్టణ ప్రగతి ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. 

పట్టణాల వారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు  కేసీఆర్. గ్రామాలు, పట్టణాల్లో అన్నిశాఖల రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా తయారు చేయాలని.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రతీ పట్టణంలో కనీసం నాలుగైదు డంపు యార్డుల కోసం స్థలాలు సేకరించాలని ఆదేశించారు. జులై నెలాఖరు వరకు ప్రభుత్వ శాఖల మధ్య పేరుకుపోయిన బకాయిలను 'బుక్ అడ్జస్ట్ మెంట్' ద్వారా పరిష్కరించాలన్నారు. హైదరాబాద్ నగరం వేగంగా అభివృధ్ది చెందుతున్నందున... అందుకు అనుగుణంగా, హెచ్ఎండీఏ పరిధిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధి కోసం.. చర్యలు తీసుకోవాలి సూచించారు సీఎం. కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లే ఔట్లు అనుమతించొద్దన్నారు. వలస కార్మికుల పాలసీని రూపొందించాలన్నారు సీఎం కేసిఆర్.